అవినీతికి పాల్పడ్డ కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో పాటు ఆయన కూతురు మార్యమ్‌ , అల్లుడు కెప్టెన్‌ సఫ్దర్‌లకు జైలు శిక్ష పడింది . ఈ కేసులో దోషులు నవాజ్‌ షరీఫ్‌కి 10 ఏళ్ల జైలు శిక్ష , 8 మిలియన్‌ పౌండ్ల జరిమానా విధించగా , ఆయన కూతురు మార్యమ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష , 2 మిలియన్‌ పౌండ్ల జరిమానా , సర్దార్‌కు ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది .

పాకిస్థానీయులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న ఈ కేసు శిక్ష ఖరారు తీర్పు ఈరోజు వెలువడుతోన్న నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు . పనామా పేపర్లలో నవాజ్‌ షరీఫ్‌ పేరు ఉండడంతో పాక్‌ నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో విచారణకు ఆదేశించిన విషయం విదితమే .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments