తెలుగు సినీ ఇండస్ట్రీ చాలా మంది అగ్ర హీరోలకు సొంత ఫిలిం స్టూడియోలు ఏర్పాటు చేసుకుని సినిమాలు నిర్మిస్తూ విజయాలు సాధిస్తున్నారు . ఇప్పుడు అదే కోవలోకి ఇప్పుడు మరో స్టార్ హీరో చేరారు . కొన్ని దశాబ్దాల నుండి మెగాస్టార్ చిరంజీవికి సొంత నిర్మాణ సంత ఏర్పాటు చేసుకోవాలనేది ఓ కల . కానీ ఆయన సినిమాలలో బిజీ ఉంది ఆ తరువాత ఒక దశాబ్ద కాలం పాటు రాజకీయాలలో తీరిక లేకపోవడంతో ఆ కల నెరవేరలేదు . అయితే ఇప్పుడు ఆయన తనయుడు రాంచరణ్ తేజ్ తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఏర్పాటు చేసి ఇప్పుడు సైరా వంటి భారీ బడ్జెట్ తో కూడిన సినిమాలు చేస్తున్న విషయం తెలిసినదే . ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో దాదాపు 22 ఎకరాల స్థలంలో భారీ సెట్ లో జరుగుతోంది . అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాంచరణ్ కు అదే స్థలంలో స్టూడియో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది . మరి ఇదే జరిగితే కనుక దశాబ్దాల కాలంగా మిగిలిపోయిన చిరంజీవి కల కచ్చితంగా నెరవేరుతోంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments