ఆమెకి ఈసారి హిట్ గ్యారంటీ …

763

తెలుగు సినీ ఇండస్ట్రీ ని శాసిస్తున్న పెద్ద కుటుంబాలలో ఒకటైన మెగా కుటుంబం నుండి అడుగుపెట్టినా తన స్వయంకృషినే నమ్ముకుంటూ వెళ్తున్నారు మెగా డాటర్ నిహారిక . ఆమె మొదట ఒక ప్రోగ్రామ్ హోస్ట్ గా ప్రేక్షకులకు పరిచయమై , తరువాత నాగశౌర్య హీరోగా ఒక మనసు సినిమా తో హీరోయిన్ గా తొలి ప్రయత్నం చేశారు . ఆ సినిమా పెద్దగా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయినా ఆమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి . ఒక మనసు సినిమా తరువాత చాలా కాలం తరువాత ఆమె హీరొయిన్ గా వస్తున్న సినిమా హ్యాపీ వెడ్డింగ్ . సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందింది . లక్ష్మణ్ కార్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు . అయితే తాజాగా ఈ చిత్రణ ట్రైలర్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది . అయితే ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన 11 గంటలలలోనే 10 లక్షల వ్యూస్ వచ్చాయి . దీని బట్టి చూస్తే ఈ సినిమా నిహారిక కెరీర్ లో మంచి హాట్ గా నిలవనుంది కచ్చితంగా చెప్పొచ్చు . మంచి ఫామిలీ సెంటిమెంట్ , నిజజీవితానికి దగ్గరగా ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here