కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కమ్ముల బాలసుబ్బారావు(79) ఆదివారం గుండెపోటుతో ఏలూరులోని ఆయన స్వగృహంలో మృతి చెందారు . బాలసుబ్బారావు 1981లో ఎమ్మెల్సీగా, 1982లో రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు . 1987 నుండి 1992 వరకు పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఎంపీగా చేసిన కాలంలో కౌన్సిల్ ఆఫ్ స్పోర్ట్స్ సభ్యులుగా పనిచేసి తొమ్మిదో ఆసియా క్రీడలు ఘనంగా నిర్వహించడంలో తనవంతు పాత్ర పోషించారు. ఏపీ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేసిన కాలంలో జాతీయస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించారు.
Subscribe
Login
0 Comments