సామాన్యుడిగా బిగ్ బాస్ షో లోకి అడుగు పెట్టి ఆయన వ్యక్తిత్వంతో ప్రేక్షకులలో మంచి పేరు సంపాదించుకున్నారు నూతన్ నాయుడు . బిగ్ బాస్ రెండొవ వారంలో ఆయన ఎలిమినేట్ అయిన విషయం తెలిసినదే . తాజాగా ఆయన ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు . ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ప్రజారాజ్యం పార్టీ సమయంలో అనుభవాలను పంచుకున్నారు . ఆయన మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో తానెంతో కృషి చేశానని , ఆ సమయంలో పవన్ కల్యాణ్ తన పనిని గుర్తించి బాగా వెన్ను తట్టి ప్రోత్సహించేవారని ,ఆయనపై ఎల్లప్పుడూ కృతజ్ఞత భావం కలిగి ఉంటానన్నారు .

ఈ సందర్భంగా వ్యాఖ్యాత జనసేన పార్టీ కి దూరంగా ఉండడానికి గల కారణం అడగగా నూతన్ నాయుడు బదులిస్తూ తాను జనసేన కే కాదు , పవన్ కల్యాణ్ కు కూడా చాలా సంవత్సారాల నుండి దూరంగా ఉన్నానని కానీ ఆత్మీయమైన ఇద్దరు మనుషులు వాళ్ళ ఆత్మలు కలిసున్నంత కాలం మనుషులు ఎంత దూరంగా ఉన్నా డిస్టెన్స్ అనిపించుకోదన్నారు . పవన్ కల్యాణ్ ఏ సమయంలోనైనా నూతన్ నాయుడు చేయాలని అనిపించినా కాకితో కబురుపెట్టినా హనుమంతుడిలా ఆయన పాదాల దగ్గర కూర్చుంటానన్నారు . ఈ రోజు వరకు తన అవసరం రాకపోవడంతో తనకు కబురు రాలేదని భావిస్తున్నానాని అనుకుంటున్నానన్నారు .

ఈ క్రమంలో పవన్ పై తనకున్న ప్రేమను తెలుపుతూ నూతన్ నాయుడు ఒక సంఘటను గుర్తుచేసుకున్నారు . తన భార్య డెలివెరీ సెప్టెంబర్ 2 న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్లాన్ చేసినా కడుపులోని బిడ్డ ఎక్కువ నీరు తాగడంతో డాక్టర్లు ఆగష్టు 29 న డాక్టర్లు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలన్నారని , దానితో తమ పాప ఆగష్టు 30 న పుట్టిందని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments