వైసీపీ , బీజేపీ లేదా జనసేనతో పొత్తు పెట్టుకుంటుందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాదరావు సైతం మీడియా ముందు పవన్ రానున్న ఎన్నికలలో తమ పార్టీ కి మద్దతు ఇస్తానన్నట్టు ఆయనే ప్రకటించినట్టు తెలిపారు . అయితే ఈ వార్తలు చెక్ పెడుతూ రానున్న ఎన్నికలలో పొత్తులపై వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు . ప్రజాసంకల్ప యాత్ర 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాము ఏ పార్టీతోనూ కలవమని , ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చే వారికి మద్దతు తాము మద్దత్తు తెలుపుతామన్నారు .

గత ఎన్నికల సమయంలో చంద్రబాబు తాను అనుభవజ్ఞుడినని చెప్పుకోవడం , మోదీ హవా , పవన్ కల్యాణ్ మద్దతు తో చంద్రబాబు గద్దెనెక్కారని అన్నారు . ఇంత జరిగినా కూడా తాము కేవలం 1.5 శాతం ఓట్ల తేడా తోనే ఓడిపోయామని జగన్ పేర్కొన్నారు . ప్రస్తుతం తన దృష్టి అంతా పాదయాత్ర పైనే ఉందని , ముందస్తు ఎన్నీఆలోచిందడం లేదని తేల్చి చెప్పారని . గత ఎన్నికలలో చంద్రబాబు ప్రజలకు అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని అవే ముఖ్యంగా తమ ఓటమికి కారణమని జగన్ వెల్లడించారు . అయితే ప్రస్తుత పరిస్థితులు వేరుగా ఉన్నాయని , చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని ప్రజలు గుర్తించారని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments