ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజన్న రాజ్యం తిరిగి తెస్తానని చెబుతున్న విషయం తెలిసినదే . అయితే ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు . ఇంతకీ జగన్ తెచ్చేది క్రాప్ హాలిడేనా ? లేక పవర్ హాలిడేనా ? అని ఎగ్దేవా చేశారు . నిన్న యనమల విడుదల చేసిన ప్రెస్ నోట్ లో “వైఎస్సార్ హయాంలో 14,079 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు . ఆ పాలన మళ్లీ తెస్తారా? విద్యుత్ సరఫరా లేక 15 రోజులు పరిశ్రమలు మూతపడిన పాలన తెస్తారా? 11 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డ పాలన తెస్తారా? ఒక బస్తా ఎరువుకు రెండు లాఠీ దెబ్బలు ఉచితం అనే పాలన తెస్తారా? పోలీస్ స్టేషన్‌లలో విత్తనాలు పంపిణీ చేసిన పాలన తెస్తారా? “అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు .