కడప లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకై తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఒక వైపు దాదాపు 10 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తుంటే మరో వైపు ఢిల్లీ లో తెలుగుదేశం ఎంపీలు దీక్షలపై పై జోకులు వేసుకుంటున్నారు . ఇప్పుడు దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతోంది ఈ వీడియోలో తాను ఐదు కేజీల వరకూ బరువు తగ్గాలని అనుకుంటున్నట్టు చెప్పిన మురళీమోహన్ , ఓ వారం రోజుల పాటు దీక్షలో కూర్చోగలనని అన్నారు. ఆ వెంటనే కల్పించుకున్న దివాకర్ రెడ్డి, ‘ఈయన్ను పెడదాం ,డన్’ అంటూ సెటైర్ వేయగా, మరో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కల్పించుకుంటూ, “ఆయన్ను మొదటి రోజే రాంమనోహర్ లోహియా ఆసుపత్రికి తీసుకెళ్లాం ఈయనెందుకు?” అని అన్నారు. రవీంద్రకుమార్ ఈ మాటనగానే అక్కడే ఉన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు ‘అదేకదా’ అని అనడంతో ఎంపీల మధ్య నవ్వులు విరబూశాయి . ఇదే వీడియోలో అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ “జోనూ లేదు గీనూ లేదు” అని వ్యాఖ్యానించడం వినిపించింది . ఈ మీటింగ్ లో ఎంపీలు కేసినేని నాని, బుట్టా రేణుక తదితరులు కూడా కనిపిస్తున్నారు .

అయితే ప్రజలలో తెలుగుదేశం పార్టీపై విపరీతమైన వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈ వీడియో అగ్నికి ఆద్యం అన్నట్టు తయారయ్యే అవకాశం ఉంది . ఈ వీడియో లో వారి మాటలను బట్టి చూస్తే ప్రజల ఓట్ల గెలిచి వారి కోసం పార్లమెంట్ లో పోరాడవలసిన ఎంపీలు ప్రజల సమస్యలపై ఆలోచించకుండా కేవలం వారి స్వలాభం కోసం మాత్రమే పనులు చేస్తారనేది రుజువయ్యింది . ఎన్నికలకు సంవత్సర సమయం కూడా లేని నేపధ్యం ఈ వీడియో బయటకు రావడంతో చర్చలు మొదలయ్యాయి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments