విశాఖ రైల్వే జోన్ , కడప స్టీల్ ప్లాంట్ కు బీజేపీ కట్టుబడి ఉందని , అయితే చంద్రబాబు అడిగితే మాత్రం తాము ఇవ్వమని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు తెలిపారు . కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్ కడపలో మూతబడ్డ ఫ్యాక్టరీలు ఎందుకు తెరిపించడం లేదని ప్రశ్నించారు . బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆపలేని డీజీపీ మాలకొండయ్య టీడీపీ గౌరవ అధ్యక్షుడిగా మారిపోవడం బెటర్ అని సోము వీర్రాజు ఎగ్దేవా చేశారు .