నిర్మాణ సంస్థ‌లు: ఎస్‌.కె.పిక్చ‌ర్స్‌, ఆర్‌.ఆర్‌.పిక్చ‌ర్స్‌
తారాగ‌ణం: శ‌ంక‌ర్‌, కారుణ్య‌, నాగినీడు, అజ‌య్ ఘోష్‌, ర‌విప్ర‌కాశ్‌, ఏడిద శ్రీరాం, ప్ర‌భు త‌దిత‌రులు
సంగీతం: సాయికార్తిక్‌
కెమెరా: రాజ‌శేఖ‌ర్‌
కూర్పు: ఛోటా కె.ప్ర‌సాద్‌
నిర్మాత‌లు: వై.ర‌మణారెడ్డి
క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్ ఎన్‌
క‌థ‌:
గాజుల‌మ్మ‌ప‌ల్లెకు చెందిన శంక‌ర్‌(ష‌క‌ల‌క శంక‌ర్‌) పోలీస్ కావాల‌ని అనుకుంటూ ఉంటాడు. ఊర్లోకి ప్రెసిడెంట్(అజ‌య్ ఘోష్‌), పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్(ప్రభు) స‌హ‌కారంతో.. ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేస్తుంటాడు. వాటికి శంక‌ర్ ఎదురు తిరుగుతుంటాడు. దాంతో వారిద్ద‌రూ శంక‌ర్‌పై క‌క్ష పెంచుకుంటారు. ఓసారి పోలీస్ సెల‌క్ష‌న్స్‌లో ఎంపికైన శంక‌ర్‌ను ప‌క్క‌న పెట్టేస్తారు. నీటి స‌మ‌స్య ఊరిని, రైతుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. ప్రెసిడెంట్ స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోడు. శంక‌ర్ చెల్లెల్ని ప్రెసిడెంట్ కొడుకు ప్రేమ పేరుతో లొంగ‌దీసుకోవాల‌నుకుంటాడు. ఆమె ఎదురు తిర‌గ‌డంతో ఆమెను చంపేస్తాడు. దాంతో శంక‌ర్, ప్రెసిడెంట్ కొడుకుని చంపేస్తాడు.ఎస్‌.పి(నాగినీడు)కి శంక‌ర్ గురించి తెలుసు కాబ‌ట్టి అత‌ను శంక‌ర్‌ని త‌న పూచీ క‌త్తుపై విడుద‌ల చేస్తాడు. శంక‌ర్ వెళ్లి ప్రెసిడెంట్‌ని ఢీ కొట్టాల‌నుకుంటాడు. అప్పుడు శంక‌ర్ ఏం చేస్తాడు? ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? క‌థ చివ‌ర‌కి ఏమ‌వుతుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేష‌ణ‌:
క‌మెడియ‌న్ హీరోలుగా మారిన హీరోలుగా వారి స‌క్సెస్ రేట్ అంతంత మాత్ర‌మే. కొంద‌రు క‌మెడియ‌న్స్‌గా రాణిస్తూ.. అవ‌కాశం ఉన్న‌ప్పుడ‌ల్లా హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. హీరో కావాల‌ని ఆశ ప‌డ్డ ష‌క‌ల‌క శంక‌ర్‌.. ఓ మంచి క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సింది. ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ క‌థంతా ఓ ప‌ల్లెటూరిని బేస్ చేసుకుని రాసుకున్నాడు. స‌న్నివేశాల‌ను లింకుల‌తో రాసుకున్నాడా? అంటే లేద‌నే చెప్పాలి. ప్ర‌తి సీన్ ఎందుకు వ‌స్తుందో.. ఎందుకు ఎండ్ అవుతుందో అనే చందాన తెర‌పై మ‌న‌కు క‌న‌ప‌డుతుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానిగా శంక‌ర్ త‌నని చూపించుకునే ప్ర‌య‌త్నం చేశాడు కానీ.. ఆ అభిమానం మ‌రి ఎక్కువైంది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ ఫ‌స్టాఫ్ ఓ గోల్ లేకుండా ఉంటుంది. హీరో బోరింగ్ వ‌ద్ద‌కు నీళ్ల కోసం వ‌చ్చిన అమ్మాయిల‌తో పాట‌లు పాడ‌టం ఏంటో.. హీరోయిన్‌, హీరో వెంట‌ప‌డ‌టం .. పాట‌లు పాడుకోవ‌డం కృత‌కంగా ప్రేక్ష‌కుల‌కు స‌హనానికి ప‌రీక్ష‌గా ఉంటాయి. ప్రెసిడెంట్‌ని ప‌ర‌మ విల‌న్ అని సినిమాలో చెప్పారు కానీ.. అస‌లు ప్రెసిడెంట్‌లోని విల‌నిజాన్ని తెర‌పై ఆవిష్క‌రించిన తీరు పేల‌వంగా ఉంది.
హీరోయిన్ క్యారెక్ట‌రైజేష‌న్ ఎందుక వ‌స్తుందో.. ఎందుకు వెళ్లిపోతుందో ప్రేక్ష‌కుడికి అర్థం కాదు. హీరో, అత‌ని చెల్లెలు మ‌ధ్య సెంటిమెంట్ స‌న్నివేశాలు , హీరో చెల్లెలు కోసం ప్రెసిడెంట్ కొడుకుని చంపేయ‌డం ..పోలీసుల కేసు పెట్ట‌కుండా అత‌న్ని వ‌దిలేయడం ఇవ‌న్నీ క‌ల్ప‌న‌కే చాలా దూరంగా ఉన్న‌ట్లు అనిపిస్తాయి. ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా చేసిన ప్రయత్నం వృథా. సాయికార్తిక్ సంగీతం, నేప‌థ్య సంగీతం బాలేదు. ఇక రాజ‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎడిటింగ్ గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. క‌థ‌, క‌థ‌నం, సాంకేతిక‌త ప‌రంగా ఈ ప్ర‌య‌త్నం ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌దు.
తాజావార్తలు రేటింగ్‌: 2/5
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments