పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవలే నిశ్చితార్ధం చేసుకొని రెండొవ పెళ్ళికి రెడీ అవుతున్నారు . పవన్ ఫాన్స్ మాత్రం చాలా వరకు ఈ విషయంలో హార్స్ గా రియాక్ట్ అవుతూ రేణు ను ఇబ్బంది పెట్టడంతో ఇదివరకే పలుమార్లు ఆమె పవన్ అభిమానులను వివిధ మాధ్యామాల ద్వారా హెచ్చరించారు . అయితే ఇప్పుడు ఈ నిశ్చితార్ధం వివాదం పై పవన్ అభిమానులు హద్దులు మీరి ఆమెకు మెసేజెస్ పంపడంతో ఆమె మళ్ళీ తాజా పవన్ ఫాన్స్ కు వార్నింగ్ ఇచ్చారు .

ఆమె స్పందిస్తూ విడాకుల వ్యవహారం పై తాను ఇన్నాళ్లు మౌనంగా ఉన్నందుకు పవన్ అభిమానులు కృతజ్ఞతతో ఉండాలని , మర్యాదగా ప్రవర్తించాలని అన్నారు . విడాకుల వ్యవహారం పై తాను కనుక నోరు విప్పితే అభిమానుల పొగరు మురికి కాలువలో పది కొట్టుకుపోతోందని రేణు హెచ్చరించారు . విడాకుల వెనుక ఉన్న వాస్తవాలాను కనుక బయట పెడితే పవన్ అభిమానులకు గర్వభంగం తప్పదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు .

పవన్ అభిమానులకు మర్యాద తెలియదని , అవివేకులని అన్నారు . తనను ట్రోల్ చేయడం ఇకనైనా మానుకోవాలని హెచ్చరించారు . ఇంకా మాట్లాడుతూ పవన్ అభిమానుల నెగిటవిటీని భరించాల్సిన అవసరం తనకు లేదని , అసలు తానేం చేశానని వాటిని భరించాలని రేణు దేశాయ్ ప్రశ్నించారు . దయచేసి సలహాలు ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు . అభిమానుల మూర్ఖత్వానికి తెరపడి, తన గురించి, తన పని గురించి వచ్చే కామెంట్లను స్వేచ్ఛగా చదువుకునే రోజు రావాలని ప్రార్థిస్తున్నట్టు రేణు దేశాయ్ పేర్కొన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments