జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తూ ప్రభుత్వాలు ఏ విధంగా కూడా ప్రజల సమస్యలు గురుంచి పట్టించుకోకుండా ఉంటే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కూడా వచ్చే అవకాశం ఉందని అన్న విషయం తెలిసినదే . ఈ విషయం పై ఏపీ మంత్రి నారా లోకేష్ పవన్ పై విమర్శలు గుప్పించారు . నిన్న గుడివాడలో గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గౌతు లచ్చన్న లాంటి వ్యక్తి పై పవన్ విమర్శలు చేయడం తనను బాధించాయని , విమర్శలు చేసే ముందు పవన్ ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు .

ఇంకా మాట్లాడుతూ “ఉత్తరాంధ్ర రాష్ట్ర ఉద్యమం ” అంటూ ఉత్తరాంధ్ర ప్రజల్లో పవన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని , అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని లోకేష్ అన్నారు . ఎన్నడూ లేని విధంగా తమ పాలనలో ఉత్తరాంధ్ర సహా మొత్తం రాష్ట్రం లో అభివృద్హి జరిగిందన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments