సమ్మోహనం సినిమాతో మంచి హిట్ జోరులో ఉన్నారు హీరో సుధీర్ బాబు . ఆయన ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు రూపొందిస్తున్నారు . ఆయన సొంత ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న సినిమా నన్ను దోచుకుందువటే . ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కొంత సేపటి క్రితం సుధీర్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా రెవీల్ చేశారు . ఈ సినిమాలో సుధీర్ బాబు కు జోడీగా నభా నటేష్ నటిస్తున్నారు . ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా నటిస్తున్నారు . ఈ చిత్రానికి ఆర్ఎస్ నాయుడు దర్శకత్వం వహిస్తుండగా అజనీష్ సంగీతం అందిస్తున్నారు .

సుధీర్ బాబు ట్వీట్ చేస్తూ “సమ్మోహనం చిత్రం పై మీరు చూపిస్తున్న అభిమానానికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే . నా సొంత నిర్మాణ సంస్థ నుండి వస్తున్న తొలి చిత్రం “నన్ను దోచుకుంటువటే” ఫస్ట్ లుక్ పోస్ట్ చేస్తున్నా” అని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments