టీఆర్‌ఎస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి. ముందస్తు ఎన్నికల నుంచి దానం ఎపిసోడ్ వరకు అన్ని అంశాలపై ఆయన స్పందించారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందని.. అసలు ఆయన ముందస్తుకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని.. తెలంగాణలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమేననే ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని సీట్లొస్తాయన్నది మాత్రం తాను చెప్పలేనని.. కర్ణాటక తరహాలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆశ్చర్యం అవసరం లేదన్నారు.

ఉత్తమ్‌కుమార్ రెడ్డి పనితీరు సంతృప్తిగానే ఉందన్నారు జానారెడ్డి. పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. డీఎస్ కాంగ్రెస్‌లోకి వస్తారన్న సమాచారం తనకు లేదని.. బీసీలకు పార్టీలో అన్యాయం జరుగుతుందని దానం నాగేందర్ చెప్పడం అబద్ధమన్నారు. గద్వాలలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here