వైసీపీ నుంచి ఎన్నికై టీడీపీలో చేరిన అఖిలప్రియకు మంత్రిగా కొనసాగే అర్హత లేదంటూ గిన్నే మల్లేశ్వరరావు అనే న్యాయవాది గతంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసినదే . అయితే తాజాగా ఈ పిటీషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది . ఇటువంటి వాజ్యం దాఖలు చేసే అర్హత పెటిషనర్ కు లేదని కోర్టు తేల్చి చెప్పింది . పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే ఫిర్యాదులు స్పీకర్‌ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని, ఆ వ్యవహారాలను వైసీపీ నేతలు చూసుకొంటున్నారని పిటిషనరే పేర్కొన్నందున.. ఈ అంశంతో అతనికి ఎలాంటి సంబంధం లేదని తేలినట్లు పేర్కొంది. రాజ్యాంగంలోని 164(4) ఆర్టికల్‌ కూడా వర్తించబోదని న్యాయమూర్తులు జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ ఎన్‌. బాలయోగిలతో కూడిన ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments