గుంటూరు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ వైసీపీ అధినేత జగన్ , జనసేన అధినేత పవన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . ఆయన మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్ తో పాటు రాష్ట్ర హక్కుల కోసం తాము పోరాడుతుంటే జగన్ , పవన్ లు మాత్రం రాష్ట్రం కోసం ఏ మాత్రం పోరాడకుండా మౌనం వహిస్తున్నారని విమర్శించారు . తమ పోరాటాన్ని కించ పరిచే విధంగా 20 సెకన్ల వీడియోను ప్రచారం చేసి అందరి దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు . రాష్త్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీ , అమిత్ షా లను నిలదీయాల్సింది పోయి వారిద్దారూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని గల్లా జయదేవ్ మండిపడ్డారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments