జిల్లాలో కాకినాడ సర్పవరం సెంటర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకుంది. బీజేపీ నేతలు శుక్రవారం ఆందోళనకు దిగారు. అంతేకాక సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అవినీతి ముఖ్యమంత్రి, అబద్ధాలకోరు ముఖ్యమంత్రి అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బైఠాయించేందుకు బీజేపీ నాయకులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రంగంలో దిగిన పోలీసులు పలువురు బీజేపీ నేతలను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments