శుక్రవారం వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు . ఆయన మాట్లాడుతూ ఢిల్లీసాక్షిగా టీడీపీ ఎంపీల నాటకాలు బయటపడ్డాయని , ఆ నేతల మాటలను అందరూ వీడియోల్లో చూశారని , ఆ వీడియో బయటకు రావడంతో మీడియాలో రాకుండా టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డది నిజం కాదా అని ప్రశ్నించారు . టీడీపీ ఎంపీలకు విభజన హామీలు నెరవేర్చడంలో చిత్తశుద్ధి లేదన్నారు . కడపలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేస్తున్నది ఉక్కు దీక్ష కాదని , తుక్కు దీక్ష అని స్వయంగా ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డే స్వయంగా చెప్పారని ఈ సందర్భంగా అంబటి రాంబాబు . చంద్రబాబుకు ధర్మపోరాట దీక్ష చేసే అర్హత లేదన్నారు . ఏపీ అభివృద్ధిపై టీడీపీ చిత్తశుద్ధి ఏంటన్నది సీఎం రమేష్ దీక్షలో , ఢిల్లీలో టీడీపీ ఎంపీల వ్యాఖ్యల సాక్షిగా మరోసారి తెలిసిందని , చంద్రబాబు ఎంపీల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకొని నోటీసులు ఇవ్వాలని ఈ సందర్భంగా అంబటి రాంబాబు డిమాండ్ చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments