ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత , వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి అన్ని విధాలా భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు . ఇప్పటికే ఆయన 2500 కి మీ మేర పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు . ఇప్పుడు ప్రజాసంకల్ప యాత్ర మరో మైలురాయిని చేరుకుంది . అదేంటంటే ప్రజాసంకల్పయాత్ర మొదలయ్యి నిన్నటికి 200 రోజులు . ఈ సందర్భంగా జగన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు .

తాను పాదయాత్ర చేస్తుండగా మెరుగైన రేపు వస్తుందనే ఆశ ప్రజల కళ్ళల్లో కనిపిస్తోందని , వారు తనపై పెట్టుకున్న నమ్మకానికి మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాని జగన్ పేర్కొన్నారు . “ప్రజాసంకల్ప యాత్ర మొదలు పెట్టిన మొదటి రోజు నుండి 200 రోజు వరకు ప్రజలు నా పై ఉంచిన ఈ నమ్మకానికి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను . ఈ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తిరిగి తీసుకొచ్చి ప్రజల ముఖాలలో చిరునవ్వులు మళ్ళీ తీసుకురావాలని దృఢ సంకల్పంతో ఉన్నా” అని జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments