ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత , వైఎస్ఆర్సీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి పట్టుదల చాలా ఎక్కువనే విషయం తెలిసినదే . గత 200 రోజులు ఆయన దృఢ సంకల్పంతో ప్రజల మధ్య తిరుగుతూ ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నారు . ఈ విషయంలో జగన్ కు అభిమానులలో బాగా క్రేజ్ పెరిగిపోయింది . అయితే ఇప్పుడు ఆయన గురుంచి ఒక విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది . అదేంటంటే గత సంవత్సరంలో జగన్ సీబీఐ కోర్టు నుండి అనుమతి తీసుకొని తన కుటుంబంతో పాటు న్యూజీలాండ్ వెళ్లిన విషయం తెలిసినదే . అయితే ఆయన వెకేషన్ లో ఉండగా కవారౌ బ్రిడ్జి వద్ద ఆయన బంగీ జంప్ చేశారు . ఎంతో గుండె ధైర్యం ఉంటె తప్ప అటువంటి సాహస కార్యాలు ఎవరూ చెయ్యరు . ఇప్పుడు జగన్ బంగీ జంప్ కు సంబందించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది . అయితే ఆయన ఆ ఫోటోలలో చిరునవ్వులు చిందించడం గమనార్హం . ఇప్పుడు ఈ ఫోటోలను జగన్ ఫాన్స్ విపరీతంగా షేర్ చేసుకుంటూ తమ నాయకుడి గుండె ధైర్యాన్ని చూసి మురిసిపోతున్నారు . ఇదే గుండె ధైర్యంతో జగన్ 2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments