వాట్సాప్ సంస్థ మరో కొత్త ఫీచర్ తో మన ముందుకు వచ్చింది . సాధారణంగా వాట్సాప్ లో వచ్చే మీడియాను మనం సెట్టింగ్స్ లోకి వెళ్లి అక్కడ ఆటో డౌన్లోడ్ డీసెలెక్ట్ చేసి ఫోన్ మెమరీ వృధా కానివ్వకుండా చూసుకుంటాం . కానీ ఇప్పుడు అంత ప్రయాస పడక్కర్లేదు . వ్యక్తుల నుంచి, గ్రూపుల్లో వచ్చే మీడియాను ఫోన్ గ్యాలరీలోకి రాకుండా నియంత్రించే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది . దీని వల్ల అటు డేటా , ఇటు ఫోన్ మెమొరీ ఆదా అవుతుందని ఆ సంస్థ అభిప్రాయపడింది . ఈ సదుపాయం ‘వాట్సాప్ బీటా వర్షన్ 2.18.159’లో అందుబాటులో ఉందని పేర్కొంది . వాట్సాప్ యూజర్లు ఈ సేవలను పొందాలంటే ఫోన్ కాంటాక్ట్ లేదా గ్రూప్‌ల ఇన్ఫోలోకి వెళ్లి మీడియా డౌన్లోడ్ ఆప్షన్‌ను తొలగిస్తే సరిపోతుంది .
Subscribe
Login
0 Comments