ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్‌ అభిమానుల హల్‌చల్‌!

0
265

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ పర్యటన నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై టీఆర్‌ఎస్‌ అధినేత అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు హల్‌చల్‌ చేస్తున్నారు. గురువారం విజయవాడ దుర్గమ్మకు మొక్కలు సమర్పించుకునేందుకు కేసీఆర్‌ కుటుంబసమేతంగా హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులులు ‘జై కేసీఆర్‌.. జై జై కేసీఆర్‌..’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమాన నేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై అభిమానం చాటుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు స్వాగతం చెబుతూ నగరంలో కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతల బ్యానర్లు, పార్టీ ఫ్లెక్సీలు దర్శనమివ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. మరోవైపు కేసీఆర్‌ రాక సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడితే కానుకలు సమర్పించుకుంటానని గతంలో మొక్కుకున్న కేసీఆర్‌.. రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి విజయవాడలో పర్యటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here