హైదరాబాద్ లోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు . ఆమె మాట్లాడుతూ ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి వస్తున్న ప్రజాదరణను చూసి టీడీపీ కి కంటి మీద కునుకు లేకుండా పోయిందని అన్నారు . ఏపీ మంత్రి నారా లోకేష్ నిజంగానే పప్పు అని మరోసారి రుజువైందన్నారు . కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే కంపెనీలను తమ ఖాతాలోకి వేసుకొని తామే తెచ్చామని లోకేష్ గొప్పలు చెపుతున్నారని , ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న లోకేష్ ను పప్పు అని పిలవకుండా ఇంకా ఏమని పిలవాలని విమర్శించారు . పప్పు అంటే ఇన్ని రోజులు విటమిన్ ఉన్న పప్పు అనుకున్నారు , కానీ అది గన్నేరు పప్పు అని ఏపీ సీఎం చంద్రబాబు త్వరలోనే తెలుసుకుంటారని రోజా ఎగ్దేవా చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments