సాయి ధరమ్ తేజ్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం తేజ్ ఐ లవ్ యూ . కే ఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించగా గోపి సుందర్ సంగీతాన్ని అందించారు . వచ్చే నెల 6 న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదల అయ్యి మంచి ఫీడ్ బ్యాక్ కు అందుకుంటోంది . అయితే ఈ చిత్ర ట్రైలర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ స్పందించారు .

తాను ఈ సినిమా ట్రైలర్ ను చూశానని , విజువల్స్ , మ్యూజిక్ రెండు బాగా ఆకట్టుకొని తనకు ట్రైలర్ బాగా నచ్చిందని రామ్ చరణ్ అన్నారు . దర్శకుడు కరుణాకరణ్ నుండి వస్తున్న ఒక నమ్మకమైన సినిమాలా అనిపిస్తోందని , ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని అందిస్తున్న దర్శక నిర్మాతలకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments