ఈ రోజుల్లో సమాజంలో మీడియా అతి ముఖ్య పాత్ర పోషిస్తోంది . ముఖ్యంగా రాజకీయ పరంగా ఈ రంగానికి ఉన్నంత ప్రాముఖ్యత దేనికీ లేదు . ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కొన్ని టీవీ చానెళ్లు ఉన్నాయి , అలాగే వైఎస్ఆర్సీపీ కి జగన్ సొంత మీడియా సాక్షి ఉండనే ఉంది . అయితే జనసేన పార్టీ , పార్టీ విషయంలో పరిస్థితి వేరు . చాలా చానెళ్లలో జనసేన పార్టీ విషయాలు , పవన్ చేస్తున్న యాత్ర గురుంచి ఊసే లేదు . సరిగ్గా ఎన్నికలకు కేవలం 10 నెలల సమయం ఉన్న తరుణంలో పవన్ సరికొత్త ఆలోచన చేస్తున్నారట .

పవన్ కూడా తన సొంత మీడియా ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు . గతంలో జనసేన తరపున జేటీవీ ఛానెల్ పవన్ ప్రారంభించబోతున్నారని వార్తలు , ఆ ఛానెల్ కు సంబందించిన లోగో కూడా సోషల్ మీడియాలో రెవీల్ అయ్యింది . అయితే ఇప్పుడు కొత్త ఛానెల్ ఏర్పాటు చేస్తే ఛానెల్ కు సంబంధించి ప్రతీ ఒక్క విషయం గురుంచి , సిబ్బంది జీతాలు గురుంచి చూసుకునే వారిని ఎంపిక చేసుకోవాలి . దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయం పై కూడా బాగా అవగాహన ఉండాలి . ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న కారణంగా కొత్త ఛానెల్ నెలకొల్పడం కొంత కష్టం కాబట్టి ఆ విషయంలో పవన్ వెనక్కు తగ్గారట .

దాని తరువాత వామపక్షాలు సంబందించిన 99 టీవీ ను పవన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని వార్తలు వచ్చినా ఆ ఛానెల్ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వెలువడంతో ఆ విషయం కూడా ముందుకు కదలలేదు . అయితే ఇప్పుడు పవన్ దృష్టి జనాలలో ఇప్పటికే మంచి పేరు సంపాదించుకున్న 10 టీవీ ఛానెల్ పై పవన్ దృష్టి మళ్లిందట . ఆ ఛానెల్ సంబందించిన షేర్స్ ను చాలా వరకు ఇప్పటికే పవన్ కొనేశారని సమాచారం . ఇప్పటికే ఆ ఛానెల్ లోకి కొంతమంది సీనియర్ జర్నలిస్టులను తీసుకున్నారట . అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 10 టీవీ ను పవన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వచ్చే నెల మొదటి వారంలో లాంచ్ చేస్తారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments