పెళ్లి గురుంచి అడిగితే మండిపడ్డ మెగా డాటర్ …

582

ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధులు మెగా డాటర్ నిహారిక తన పెళ్లి గురుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురుంచి అడగగా తాను ఎవరిని పెళ్లి చేసుకుంటే తమకెందుకని , థంబ్ నెయిల్స్ కోసం తనని వాడుకుంటారా అని మండిపడ్డారు . ఇదంతా ఎక్కడ ,ఎప్పుడు జరిగిందని అనుకుంటున్నారా . సుమంత్ అశ్విన్ , నిహారిక జంటగా హ్యాపీ వెడ్డింగ్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసినదే . అయితే ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం ఒక ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు . ఆ వీడియోలో నిహారిక మొదట తన పెళ్లి గురుంచి అడగగా మండిపడి , తరువాత తాను అడిగింది హ్యాపీ వెడ్డింగ్ సినిమా గురుంచి అని ప్రతినిధి అడగగా ఈ నెల 30 న సినిమాకు సంబందించిన ట్రైలర్ ను విడుదల చేస్తామని , ఆ రోజున చిత్రం విడుదల తేదీని వెల్లడిస్తామని తెలిపారు . ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here