టాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది . ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్ఠీఆర్ బయోపిక్ , మమ్ముట్టి ప్రధాన పాత్రలో వై ఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ యాత్ర తెరకెక్కుతున్నాయి . అయితే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ కు రంగం సిద్ధమైంది . కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మాణ సారధ్యంలో అల్లూరి కృష్ణంరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు . ఈ సినిమాకు “ఉద్యమ సింహం ” అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం . అయితే కేసీఆర్ పాత్ర కోసం చాలామంది నటులను చిత్ర బృందం పరిశీలించగా నాజర్ ఖరారయ్యారు . ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments