గత కొన్ని రోజులుగా కడప ఉక్కు కర్మాగారం సాధన కోసం తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే . ఇప్పుడు ఈ విషయం పై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా సెటైర్లు వేశారు . గురువారం వైసీపీ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ గత నాలుగేళ్ల పాలనలో గుర్తుకురాని స్టీల్ ప్లాంట్ ఇప్పుడు గుర్తొచ్చిందా అని అన్నారు . ఇంకా మాట్లాడుతూ సీఎం రమేష్ ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేయడం లేదని , తన డైట్ కోసం మాత్రమే చేస్తున్నారని విమర్శించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments