జనసేన పార్టీ లోకి భారత మాజీ క్రికెటర్ యాలుక వేణుగోపాలరావు చేరారు . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు స్వయంగా పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు . ఆయనతో పాటు మరి కొంతమంది పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు . ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 2019 లో జనసేన తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు . వేణుగోపాలరావు 2005 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టారు . 2006 లో వెస్టిండీస్ తో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు . మొత్తం 16 అంతర్జాతీయ మ్యాచులలో మొత్తం 218 పరుగులు చేశారు . ఐపీఎల్ లో ఢిల్లీ , హైదరాబాద్ జట్లలో కొన్ని రోజుల పాటు ఆడారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments