కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్న విషయం తెలిసినదే . కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ సీఎం రమేష్ కు ఫోన్ చేసి దీక్ష విరమించాలని కోరారు . కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంప్రదింపులు కొనసాగిస్తున్నామని అందుచేత దీక్ష విరమించాలని కోరారు . అయితే ఉక్కు ఫ్యాక్టరీ పై అధికారిక ప్రకటన వెలువఫాడ్ డే వరకూ దీక్ష కొనసాగిస్తానని రమేష్ స్పష్టం చేశారు . ఈరోజు మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ను ఆయన నివాసంలో కలిసి ఉక్కు ఫ్యాక్టరీ డిమాండ్ గురుంచి చర్చించారు . 9 అంశాల్లో 7 అంశాలకు స్పష్టత రాగా మిగిలిని రెండు అంశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఇచ్చిన లేఖను కేంద్రమంత్రికి అందజేశారు . ఈ చర్చల అనంతరం బీరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ ప్రభుత్వం పంపిన సమాచారాన్ని అధికారులతో చర్చిస్తానని అన్నారు . అధికారులతో చర్చల తరువాతే ఈ విషయం పై స్పష్టత ఇవ్వగలనని తెలిపారు . రాష్ట్ర ప్రభుత్వ సమాచారాన్ని మెకాన్‌కు పంపాలని టీడీపీ ఎంపీలకు సూచించానని, ఇవ్వాల్సిన సమాచారాన్ని ప్రభుత్వ ఫార్మాట్‌లో మెకాన్‌కు పంపాలని చెప్పానని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే మెకాన్‌కు పంపినట్టు ఏపీఎండీసీ చైర్మన్‌ వెంకయ్యచౌదరి చెప్పారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments