బాలకృష్ణ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తన తండ్రి జీవిత చరిత్ర ‘ఎన్టీఆర్’ చిత్రంలో కృష్ణ పాత్రకు మహేష్ బాబు తప్ప మరెవరూ సరిపోరని బాలయ్య భావిస్తున్నారని, ఈ పాత్రకు మహేష్ కూడా అంగీకరించినట్టేనని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర నారా చంద్రబాబునాయుడిగా రానా నటించ నున్నారని సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రకు విద్యాబాలన్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు నాగ చైతన్యను తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మోహన్ బాబు, రాజశేఖర్ తదితరులు నటించడం కూడా ఇప్పటికే ఖాయమైంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు కనిపించడం అభిమానులను అలరించే అంశమే. ఈ సినిమాలో అన్ని పాత్రలకూ ప్రాధాన్యం ఉన్నందున పేరున్న నటులనే తీసుకోవాలని నిర్ణయించుకున్న బాలయ్య అదే దిశగా అడుగులు వేస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments