తెలంగాణ సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్లు, భక్తి ఎక్కువన్న సంగతి తెలిసిందే. తెలంగాణ వస్తే అనేక మొక్కులు చెల్లిస్తానని గతంలో ఆయన మొక్కుకున్నారు. అదే తరహాలో తెలంగాణ ఉద్యమం సమయంలో …..తెలంగాణ రావాలని కోరుకుంటూ…. విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారికి మొక్కుకున్నారు. తన కోరిక ఫలించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలోనే ఆ మొక్కు తీర్చుకునేందుకు కేసీఆర్ …గురువారం నాడు విజయవాడ వెళ్లనున్నారు.
తెలంగాణ వస్తే…కనదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించుకుంటానని కేసీఆర్ మొక్కుకున్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో పాటు కేసీఆర్ విజయవాడకు చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజుల నిర్వహించిన అనంతరం ముక్కుపుడక సమర్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ముక్కుపుడకను కేసీఆర్ తయారు చేయించారు.