కమెడియన్ గా కొనసాగుతా…

0
187

తెలుగు తెరపై సందడి చేస్తూ వచ్చిన కమెడియన్స్ లో కొంతమంది హీరోగాను తమ ముచ్చట తీర్చుకున్నారు. అయితే వాళ్లలో బ్రహ్మానందం .. అలీ వంటివారు కమెడియన్ గా చేస్తూనే .. అవకాశం వచ్చినప్పుడు హీరోగా ప్రేక్షకులను పలకరించారు. అందువలన వాళ్లకి రావలసిన  అవకాశాలు వాళ్లకి దక్కుతూనే వచ్చాయి. సునీల్ మాత్రం హీరోగా బిజీ కాగానే కమెడియన్ వేషాలకి దూరమయ్యారు . ఈ కారణంగా సునీల్ కి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది. అది దృష్టిలో పెట్టుకున్నాడో ఏమో .. తాను మాత్రం కమెడియన్ గా చేస్తూనే హీరోగా వచ్చిన అవకాశాలను  చేసుకుంటానని షకలక శంకర్ చెప్పారు . తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. హీరోగా మాత్రమే చేయాలని నేను ఫిక్స్ కాలేదు. నేను ఎలాంటి పాత్రలు చేస్తే బాగుటుందనేది దర్శక నిర్మాతలకి తెలుసు. అలాంటి పాత్రలను చేస్తూనే వుంటాను .. అవకాశం వచ్చినవుప్పుడు హీరోగా కనిపిస్తాను .. అంతే అంటూ చెప్పుకొచ్చారు …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here