ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హిజ్రాలు ఏకంగా గుడిని కట్టిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయానికి ఈరోజు మంత్రి అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలు శంకుస్థాపన చేశారు. హిజ్రాలకు రూ. 1500 పెన్సన్ తో పాటు తెల్ల రేషన్ కార్డును కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చంద్రబాబుపై కృతజ్ఞతలో హిజ్రాలు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ నిర్మాణానికి ఎంపీ టీజీ వెంకటేష్, మంత్రి అఖిలప్రియ, స్థానిక నేత అభిరుచి మధులు సహకరిస్తున్నారు. 10 కేజీల వెండితో చంద్రబాబు విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments