జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య మరో వ్యక్తిని పెళ్లాడబోతున్న విషయం తెలిసిందే. ఆమె ఎవరిని పెళ్లాడబోతున్నారే వివరాలు వెల్లడి కాకపోయినప్పటికీ… త్వరలోనే ఆమె మరో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. మరోవైపు, రేణు పెళ్లి చేసుకోబోతుండటంపై కుమారుడు అకీరా అప్ సెట్ అయ్యాడనే వార్తలు షికార్లు చేశారు.
ఓ ఆంగ్ల పత్రిక ఇదే విషయం గురించి రేణును ప్రశ్నించింది. ఈ ప్రశకు రేణు స్పందిస్తూ… తన రెండో పెళ్లి గురించి అకీరా అప్ సెట్ అయ్యాడని కొందరు ఆరోపిస్తున్నారని… అకీరా అప్ సెట్ అయిన మాట నిజమేనని చెప్పారు. అయితే, అకీరా అప్ సెట్ అయింది పెళ్లి గురించి కాదని… మెన్యూలో పన్నీర్ బటర్ మసాలా లేదని అంటూ సరదాగా సమధానమిచ్చారు.