సినీనటుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్‌కి ట్విట్టర్లో బెదిరింపులు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై రేణూ దేశాయ్ స్పందించి తన చివరి ట్వీట్ చేసి, ట్విట్టర్ నుంచి వైదొలిగింది. “ట్విట్టర్లో విపరీతమైన నెగిటివిటీ నిండి ఉందని నాకు అనిపిస్తోంది. ఇక్కడ ఉండే వాళ్లు అధికంగా అజ్ఞాత వ్యక్తులు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చిరాకుతో ఉన్న వాళ్లు.
ఒక సినిమా గురించి కానీ, రాజకీయ వ్యక్తుల గురించి కానీ, ఎప్పుడూ నెగిటివ్‌గా రాయడానికే ఇష్టపడతారు. నేను ఒక నూతన జీవితం ప్రారంభిస్తున్నాను. ఈ సమయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నేను నా ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ వేసి ఈ నెగిటివిటీకి దూరంగా ఉండదలుచుకున్నాను. అదే సమయంలో నా మంచి కోరుతూ నన్ను అర్థం చేసుకుని ప్రతికూల పరిస్థితుల్లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ
కృతజ్ఞతలు” అని రేణూ దేశాయ్ పేర్కొంది. ప్రస్తుతం ఆమె ట్విట్టర్ ఖాతాను సెర్చ్ చేసిన వారికి ఈ విధంగా కనపడుతోంది…