నటి, దర్శకురాలు, జనసేన అధినేత పవన్ మాజీ భార్య.. రేణూ దేశాయ్‌ తనకు నిశ్చితార్థం అయినట్లు ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ మేరకు కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశారు. ఆ ఫోటోల్లో రేణు, ఆమెకు కాబోయే భర్త ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. అయితే తనకు కాబోయే భర్త ఎవర్న విషయాన్ని రేణు ఇప్పటి వరకు వెల్లడించలేదు. రేణూ రెండో పెళ్లికి కొందరు నెటిజన్లు మద్దతు పలుకుతుండగా.. మరికొందరు పెళ్లి చేసుకోవద్దంటూ కోరుతున్నారు.

రేణు రెండో పెళ్లికి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ట్వీట్టర్‌ ద్వారా స్పందించిన పవన్.. ‘‘కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న రేణు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. అంతా మంచే జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రకృతి తనకు సమృద్ధియైన ఆయురారోగ్యాలు, ప్రశాంతత ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments