ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి ప్రతిపక్ష నేత జగన్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజలు టీడీపీకి 14 మంది ఎమ్మెల్యేలను ఇస్తే.. అవి చాలదన్నట్టు వైసీపీ ఎమ్మెల్యేలను కూడా సంతలో పశువుల్లా కొన్నారని ధ్వజమెత్తారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా అమలాపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. చంద్రబాబును ఎన్నికల హామీలను నెరవేర్చమని అడిగితే తాట తీస్తా.. తోక కత్తిరిస్తా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కోనసీమ కాపులపై కేసులు పెట్టి హింసిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని ఎద్దేవాచేశారు. ఓఎన్జీసీ టెర్మినల్ కోసం రూ.80 కోట్లు విలువైన ఇసుకను దోచుకున్నారని విమర్శించారు. ఇసుక, మట్టి దందాలో కలెక్టర్, ఎమ్మెల్యేలు, చినబాబుకు వాటాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను పెంచి పోషిస్తున్నారని జగన్ నిప్పులుచెరిగారు.
చంద్రబాబు ను ఉతికి ఆరేసిన జగన్
Subscribe
Login
0 Comments