బుల్లితెర ప్రేక్షకులలో హైపర్ ఆదిని గురించి తెలియనివారంటూ వుండరు. ఆయన కామెడీ పంచ్ ల కోసమే ‘జబర్దస్త్’ కార్యక్రమాన్ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లు చాలామంది వున్నారు. అలాంటి హైపర్ ఆది తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో మాట్లాడుతూ .. “కాలేజ్ రోజుల నుంచే ఎదుటివారి మాటలకు నేను ఎక్కువగా పంచ్ లు వేసేవాడిని.

క్లాస్ రూమ్ లో ఒక వైపున లెక్చరర్ పాఠం చెబుతూ ఉంటే .. మరో వైపున నేను నా ఫ్రెండ్స్ తో జోకులు వేసేవాడిని. ఒకసారి క్లాస్ రూమ్ లో తిరుగుతోన్న సీలింగ్ ఫ్యాన్ ను చూపిస్తూ .. ‘ఆ ఫ్యాన్ ను ఒకే ఒక్క వేలుతో ఆపేస్తాను తెలుసా?’ అన్నాను. వాళ్లంతా ‘ఎలా?’ అంటూ ఆశ్చర్యంగా అడిగారు. ‘స్విచ్ ఆఫ్ చేసి’ అన్నాను. అంతే .. వాళ్లంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. పాఠం చెబుతోన్న లెక్చరర్ ఆ క్లాస్ అయ్యేంతవరకూ నన్ను నిలబెట్టారు . ఆ రోజే కాదు .. క్లాస్ జరుగుతుండగా ఎప్పుడు ఎవరు మాట్లాడినా ఆయన నన్నే నిలబెట్టేవారు” అంటూ చెప్పుకొచ్చారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments