స్పీడు పెంచిన అఖిల్

610

ప్రస్తుతం మూడవ సినిమా పనుల్లో అఖిల్ బిజీగా వున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో అఖిల్ సరసన కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. రచయిత గోపీమోహన్ ఇటీవల అఖిల్ ను కలిసి ఒక కథను వినిపించాడట. ఈ కథ నచ్చడంతో వెంటనే అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే గోపీమోహన్ ఈ సినిమాకి రచయితగానే వ్యవహరిస్తాడా? .. లేకపోతే దర్శకుడిగా కూడా వ్యవహరిస్తాడా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. దర్శకుడు ఎవరనే సంగతి అటుంచితే కథ మాత్రం రెడీగానే వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here