‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన నటుల్లో గెటప్ శీను ఒకరు. ఎప్పటికప్పుడు వివిధ రకాల గెటప్స్ వేస్తూ .. ఆ షోకి ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు . అలాంటి గెటప్ శీను తాజాగా హైపర్ ఆదితో కలిసి ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు .

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ .. “నటుడిని కావాలనే ఉద్దేశంతోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. మా ఊళ్లో డ్రామాలు బాగా వేసేవాళ్లు. చిన్నప్పటి నుంచి డ్రామాలను ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూసేవాడిని. ఆ డ్రామాల్లో నన్ను పెట్టుకోమని వాళ్లను అడుగుతూ ఉండేవాడిని. కానీ నాకు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. దాంతో ఎప్పటికైనా నటుడిని కావాలని అనుకున్నాను. అలాంటి సమయంలోనే చిరంజీవి గారి ‘ఖైదీ’ సినిమా వచ్చింది. ఆ సినిమా చూసిన తరువాత నటుడిని కావాలనే కోరిక మరింత బలపడింది. ఆ పట్టుదలే ఇంతవరకూ తీసుకొచ్చింది” అని చెప్పుకొచ్చారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments