ఇటీవల గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో జరిగిన శ్రీ భూసేమత దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా వారిద్దరు పలు అంశాలపై మాట్లాడుకున్నారని పుకార్లు వచ్చాయి. ఈ విషయంపై చంద్రబాబు స్పందించారు.
ఈరోజు ఆయన అధ్యక్షతన అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. తమ నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ… ‘దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో నేను, పవన్ కల్యాణ్ పాల్గొన్నాం.. హలో అంటే హలో అనుకున్నాం తప్ప అంతకుమించి వేరే రాజకీయాలు లేవు’ అని అన్నారు. .