ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి బీజేపీ నేత సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అవినీతిలో సీఎం చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు కూడా సరిపోదని వ్యాఖ్యానించారు. ప్రతి ప్రాజెక్టు చంద్రబాబుకు ఉపాధి హామీగా మారిపోయిందని విమర్శించారు. సర్వశిక్షా అభియాన్ నిధులు లక్షన్నర కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. అధర్మ ప్రభువు ధర్మపోరాట దీక్ష చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పోలవరం కాల్వ పనుల్లో అవినీతికి పాల్పడుతున్న దేవినేని ఉమకు బీజేపీని విమర్శించే హక్కు లేదని ధ్వజమెత్తారు. కడపలో షుగర్ ఫ్యాక్టరీ, డెయిరీని తెరిపించిన తర్వాత.. సీఎం రమేష్ స్టీల్ ఫ్యాక్టరీపై మాట్లాడితే బాగుంటుందని సోము వీర్రాజు హితవు పలికారు.
చంద్రబాబుకు ఆస్కార్ కూడా సరిపోదు’
Subscribe
Login
0 Comments