ముఖ్యమంత్రి ఓఎస్డీతో నటి జీవిత భేటీ

0
223

ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో మంగళవారం సినీనటి జీవిత రాజశేఖర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీవిత హరితహారంలో భాగస్వామ్యం విషయమై చర్చించారు. ఓఎస్డీతో సమావేశం అనంతరం జీవిత మీడియాతో మాట్లాడారు. తమ ట్రస్ట్ ద్వారా హరితహారంలో పాల్గొనే విషయంపై చర్చించామని తెలిపారు.

జులై 1 న తమ కూతురు శివాని పుట్టినరోజు సందర్భంగా హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నామన్నారు. తమ కుటుంబ సభ్యులమంతా హరితహారంలో భాగస్వాములం అవుతామని ఆమె స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని జీవిత పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here