కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని అడ్డుకుంది అధికార తెలుగుదేశం పార్టీయేనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పైగా, ఇపుడు ఉక్కు దీక్ష పేరుతో తుక్కు దీక్షను చేపట్టారంటూ సెటైర్లు వేశారు.పవన్ మాట్లాడుతూ…ఈ నెల 29న కడప ఉక్కు కర్మాగారం కోసం చేపట్టే రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబరులో జనసేన, వామపక్షాలు, లోక్‌సత్తా పార్టీలు కలసి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తాయన్నారు. వామపక్షాలదీ, తమదీ ఒకే ఆలోచనలు, ఒకే భావజాలమని, మూడు నెలల్లో వామపక్షాలు, జనసేన కలసి ఉమ్మడి రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తాయని ఆయన తెలిపారు.

 

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments