గత ఏడాది తెలుగు, తమిళం దక్షిణాది భాషల్లో మొదలైన బిగ్‌బాస్ టీవీ షో ఈ సారి మలయాళంలో కూడా మొదలైంది. నిన్న సాయంత్రం నుంచి మలయాళ బిగ్‌బాస్ టీవీ టెలికాస్ట్ మొదలైంది. సెలబ్రిటీలను పరిచయం చేస్తూ ఈ షోను తనదైన రీతిలో ప్రారంభించాడు మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్. ఈ విధంగా మలయాళంలో కూడా తొలి ఎడిషన్ బిగ్‌బాస్‌ను స్టార్ హీరో ద్వారా ప్రారంభించారు. తెలుగులో కూడా తొలి ఎడిషన్ బిగ్‌బాస్‌కు టాప్ హీరోలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్‌ను హోస్టుగా నియమించుకున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు.

దానికి గానూ ఆ హీరోకి భారీ పారితోషకమే ఇచ్చారని అప్పట్లో టాక్ వచ్చింది. ఇప్పుడు మలయాళంలో కూడా హోస్టుకు భారీ పారితోషకమే ఇస్తున్నారట. మోహన్‌లాల్ అక్కడ సీనియర్ హీరో, సొంతంగా భారీ అభిమానగణాన్ని కలిగిన హీరో, స్టార్ హీరో.. బిగ్‌బాస్ సుదీర్ఘ సమయం సాగే కార్యక్రమం. కాబట్టి భారీ పారితోషకం అందుతోందని టాక్.

ఆ మొత్తం ఏకంగా 12 కోట్ల రూపాయలట. దక్షిణాదిన ఈ కార్యక్రమ హోస్టులెవరికీ ఇంత భారీ పారితోషకం ఇవ్వలేదు. ఎన్టీఆర్, కమల్ హాసన్లు కూడా ఈ భారీ మొత్తాన్ని అందుకోలేదు. లాల్‌కు మాత్రం బిగ్‌బాస్ నిర్వాహకులు ఈ భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి అధికారిక ధ్రువీకరణ లేదు. మోహన్ లాల్ పారితోషకం మాత్రం 12 కోట్ల రూపాయలనే ప్రచారం సాగుతోంది.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments