టీడీపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని బుజ్జగించారు మంత్రి గంటా శ్రీనివాసరావు. తెలుగు దేశం పార్టీ నుంచి మారొద్దంటూ సూచించారు. పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించుకుందామన్నారు. నిన్న రాత్రి నెల్లూరుకు వెళ్లిన గంటా శ్రీనివాసరావు.. ఆనం రాంనారాయణ ఇంటికి వెళ్లారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన వీరిద్దరూ మొదట్నుంచి అన్యోన్యంగా ఉండేవారు. ఆనం వివేకానందారెడ్డి మృతిపై సంతాపం తెలపడానికి వచ్చిన గంటానూ.. రాంనారాయణ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఇద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపారు. తనకు వ్యతిరేకంగా స్థానిక నేతలను అధిష్టానం ప్రోత్సహిస్తుండడంపై ఆనం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments