29న గద్వాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

0
171

ఈ నెల 29న జోగులాంబ గద్వాల జిల్లాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్.. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు.

రూ.553.98 కోట్లకు పరిపాలనా అనుమతులు
జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపిన విషయం విదితమే. మొత్తం రూ.553.98 కోట్లకు పరిపాలనా అనుమతులు లభించాయి. గట్టు ప్రాంత సమస్యకు తప్పకుండా పరిష్కారం చూపుతానని తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలుపుకొన్నారు. గట్టు, ధరూర్ మండలాల్లోని 25 వేల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 3 వేల ఆయకట్టు స్థిరీకరణతో మొత్తం 28,000 ఎకరాలకు సాగునీరందించేలా ఈ ఎత్తిపోతలకు డిజైన్ చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here