ఆదివారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడగా , మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు . గాయపడిన వారిని సమీపంలో గల ఆసుపత్రికి తరలించారు . మృతులు కోడుమూరు మండలం కాళ్లపాడుకు చెందిన వారీగా పోలీసులు గుర్తించారు .

వివరాలలోకి వెళితే వీరంతా నాటు వైద్యం కోసం మహానంది వెళుతుండగా ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె దగ్గర నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వీరి ఆటోను ఢీ కొట్టడంతో ఆటో నుజ్జు నుజ్జయ్యింది . ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానికులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు . ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది . పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments