పవన్ ఫాన్స్ కు రేణు దేశాయ్ ఘాటైన రిప్లై …

1108

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాను రెండొవ పెళ్ళికి సిద్ధమన్నట్టు ఇటీవల తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేసి , తన భావాలను ఒక కవిత ద్వారా తెలిపిన విషయం తెలిసినదే . అయితే ఇప్పుడు ఆమె రెండొవ పెళ్లి గురుంచి పవన్ ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు . ఒక పవన్ ఫ్యాన్ ఆమెకు “మేడం మీరు మరో వివాహం చేసుకోవద్దు . అలా చేస్తే , మీకూ బయటివారికి తేడా ఏముంటుంది ? అసలు పవన్ కళ్యాణ్ మీలాంటి అందమైన భార్యను ఎందుకు వదులుకున్నారో అర్ధం కావడం లేదు” అని కామెంట్ చేయగా రేణు దేశాయ్ స్పందిస్తూ “ఇలాంటి క్రేజీ అబ్బాయిలు వారి తల్లులు . అక్క చెల్లళ్ళతో ఎలా ప్రవర్తిస్తుంటారో ? వారి మానసిక ఆరోగ్యం గురుంచి చింతిస్తున్నాను ” అని వ్యాఖ్యానించారు . మరొక పవన్ అభిమాని “మీరు ఇంకో పెళ్లి చేసుకుంటే గొడవలు వస్తాయ్ . నా దేవుడికి ఎలాంటి సమస్యా రాకూడదు .ఏం చేసినా ఆలోచించి చేయండి ” అని కామెంట్ చేయగా క్రేజీ అని రేణు దేశాయ్ స్పందించారు . ఇక పలువురు ఆమెకు రెండొవ వివాహం విషయంలో మద్దతు ప్రకటించారు . తనకు మద్దతిస్తున్న అబ్బాయిలకు పేరుపేరునా ధన్యవాదాలు చెప్పాలని ఉందని , వారి తల్లితండ్రులు వారిని చక్కగా పెంచారని రేణు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here